రామాయణంలో లక్ష్మణుడు మరణానికి కారణం ఎవరో తెలుసా…?

Ramayana how did laxman die : కొన్ని సంఘటనలు కొందరి మరణానికి కారణమవుతాయి. ఇంకొందరికి విషాదం మిగులుస్తాయి. ఇచ్చిన మాట ప్రకారం చేస్తే కొందరికి ముప్పు పొంచి ఉంటుంది. సరిగ్గా లక్ష్మణుడి విషయంలో ఇలానే జరిగిందని అంటారు. నిజానికి రాముడి వెంటే లక్ష్మణుడు నడుస్తాడు. రాముడు అరణ్య వాసానికి వెళ్ళినపుడు కూడా లక్ష్మణుడు అనుసరించాడు. సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ విగ్రహాలు చాలా చోట్ల గుళ్ళల్లో ఉంటాయి. అంతలా రాముడికి లక్ష్మణుడికి బంధం వుంది.

అయితే లక్ష్మణుడి మరణానికి రాముడే కారణమయ్యాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. అదెలా అంటే రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకం, సీతాదేవిపై నిందలు, సీతను అడవిలో వదిలిపెట్టడం, లవకుశల జననం, సీత భూమాత దగ్గరకు వెళ్లిపోవడం, లవకుశలకు పట్టాభిషేకం వంటివన్నీ తెలిసినవే. అయితే ఈ దశలోనే రాముడు దగ్గరకు యముడు వచ్చి సీక్రెట్ గా ఏదో మాట్లాడాలని చేబుతాడట.

దాంతో మందిరం వెలుపల లక్ష్మణుణ్ణి కాపలా పెట్టి, రాముడు, యముడు సంభాషణ చేసుకునే సమయంలో దుర్వాస మహాముని వస్తాడు. లక్ష్మణుడు అడ్డ గించడం, దాంతో 100ఏళ్ల వరకు అయోధ్యలో పంటలు లేక అలమటిస్తారని ముని శపించడం జరిగిపోతాయి. దాంతో శాంతించాలని మునిని వేడుకుని, లోపలకు వెళ్లి విషయం వివరిస్తాడు. తర్వాత లోపలకు రాకూడదన్న నియమాన్ని ఉల్లంగించినందుకు సరయు నది ఒడ్డుకి వెళ్లి లక్ష్మణుడు ఆత్మత్యాగం చేసుకుంటాడు