MoviesTollywood news in telugu

ఇప్పటి వరకు ఈటీవీ లో రాత్రి 8 గం.లకు ప్రసారమైన డైలీ సీరియల్స్

Ee Tv Serials : రిన్ ప్రియరాగాలు, హార్లిక్స్ హృదయాంజలి, సన్ రైజ్ నాడు నేడు వంటివి రాత్రి 8గంటల స్లాట్ లో మొదలయ్యాయి. 2000 లో శాంతినివాసం సీరియల్ 8గంటలకు డైలీ సీరియల్ గా స్టార్ట్ అయింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సీరియల్ స్టార్ట్ అయింది. రంగనాధ్, సమీర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ, పావని తదితరులు నటించారు. ఎస్ ఎస్ రాజమౌళి ఎపిసోడ్ డైరెక్టర్ గా చేసాడు. సోమవారం నుంచి గురువారం వరకూ మాత్రమే ఇది మొదట్లో ప్రసారమయ్యేది.

2001లో చదరంగం సీరియల్ స్టార్ట్ అయింది. ఇది రాత్రి 9న్నరకు ప్రసారమయ్యేది. కానీ శాంతినివాసం పూర్తవ్వడంతో ఆ ప్లేస్ లో దీన్ని పెట్టారు.
ఇది పూర్తయ్యాక 8గంటలకు అన్నయ్య సీరియల్ స్టార్ట్ చేసారు. సూపర్ స్టార్ కృష్ణ , అచ్యుత్ నటించారు. 2003లో ప్రియాంక డైలీ సీరియల్ ప్రసారమైంది. శ్రీకృష్ణ కౌశిక్, చక్రి, ఫాతిమా బాబు, మహర్షి, అభిత తదితరులు నటించారు. సూపర్ హిట్ గా నిల్చిన ఈ సీరియల్ తర్వాత రాత్రి 7గంటల స్లాట్ కి మార్చారు.

2005లో అగ్నిగుండం సీరియల్ స్టార్ట్ అయింది. సుమన్ రచన, దర్శకత్వం అందించాడు. శరత్ బాబు, యమున, అశ్విని, శ్రీకృష్ణ కౌశిక్, తదితరులు నటించారు. 2006లో సమీరా, రామ్మోహన్, తదితరులు నటించిన ఆడపిల్ల సీరియల్ స్టార్ట్ అయింది. అయితే అనివార్య కారణాలతో మధ్యలో ఆగిపోయింది.

తర్వాత 7గంటలకు ప్రసారమయ్యే చంద్రముఖి సీరియల్ 8గంటలకు మార్చారు. నిరుపమ్ మంజుల, చలపతి, ప్రీతి నిగమ్, తదితరులు నటించిన ఈ సీరియల్ మంచి ఆదరణతో చాలా ఏళ్ళు నడిచింది. ఇది పూర్తయ్యాక 2013లో స్వాతి చినుకులు సీరియల్ స్టార్ట్ చేసారు. డైరెక్టర్ క్రిష్ కాన్సెప్ట్ అందించిన ఈ సీరియల్ సితార, ప్రీతి నిగమ్, రషిత, నీరజ, శ్రావణి, సిద్ధార్ధ్ వర్మ, భావన ఆదర్శ్, తదితరులు నటించారు.

ఈ సీరియల్ పూర్తయ్యాక ఇదే టైం లో యమలీల ఆతర్వాత సీరియల్ స్టార్ట్ అయింది. 2020లో మొదలైన ఈ సీరియల్ లో సుమన్, అలీ, మంజుభార్గవి, భావన, సోనియా సింగ్, సంధ్య తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ ను ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ప్రసారం చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."