MoviesTollywood news in telugu

బీమ్లా నాయక్ కోసం త్రివిక్రమ్ కి దక్కింది ఎంతో తెలుసా ?

Bheemla nayak Trivikram Share : రైటర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, డైరెక్టర్ గా కూడా దూసుకుపోతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాసేపు డైరెక్షన్ పక్కన పెట్టి, మళ్ళీ రైటర్ గా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దగ్గుబాటి రానా కూడా నటిస్తున్న బీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నాడు.

సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని హాసిని అండ్ హారిక క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ అధినేత రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. నిర్మాత చాలా దగ్గర ఫ్రెండ్ కూడా కావడం, పవన్ కూడా ఫ్రెండ్ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నాడు. ఈ మూవీకోసం ఏకంగా 15కోట్లు త్రివిక్రమ్ చార్జ్ చేస్తున్నట్లు టాక్.

ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఓ మూవీ ప్రకటించాడు. ఇవి లేటవుతున్న నేపథ్యంలో రైటర్ గా బీమ్లా నాయక్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీకి పవన్ ఫాన్స్ లో భారీ అంచనాలున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."