దృశ్యం 2 సరిత బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా ?

Drushyam 2 actress suja varunee : విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలలో నటించిన దృశ్యం మూవీకి సీక్వెల్ గా సేమ్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం దృశ్యం2 మూవీ గురువారం అమెజాన్ ప్రైమ్‌‌లో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఆశీర్వాద్‌ సినిమాస్‌ నిరించిన ఈ మూవీలో సరిత అనే పాత్రలో నటించి, వీక్షకుల మెప్పు పొందుతున్న నటి సుజా వరుణి పక్కంట్లో ఉండే ఇల్లాలుగా బాగానే ఆకట్టుకుంది. దీంతో ఈమె గురించి సెర్చింగ్, చర్చ నడుస్తున్నాయి.

తమిళ్‌‌‌‌లో 2002లో ప్లస్ 2 మూవీతో సుజా వరుణి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈమె అసలు పేరు సుజాత. ఆమె తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించింది. తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి సినిమాలో హేమ అనే చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, అలీ బాబా ఒక్కడే దొంగ సినిమాలు చేసింది.

తమిళ్‌‌లో కమలహసన్ హోస్ట్ గా 2017లో వచ్చిన బిగ్ బాస్ లో పాల్గొన్న సుజా వరుణి 91 రోజులు హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయింది. ఈమె నటుడు శివాజీ దేవ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసినా ఆమెకి అంతగా పేరు రాలేదు. అయితే దృశ్యం 2 సుజా వరుణికి మంచి పేరు తెచ్చింది. ముగిసిన కేసును పోలీసులు రీఓపెన్‌ చేస్తే రాంబాబు మళ్ళీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనే కథతో మలయాళంలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన దృశ్యం 2ని తెలుగులో ఆయనే తెరకెక్కించారు.