Healthhealth tips in telugu

15 రోజులు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి జీవితంలో రక్తహీనత సమస్య అనేది ఉండదు..ఇది నిజం

Iron Rich Foods In Telugu :శరీరంలో తగినంత రక్తం లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీర భాగాలు, అలాగే శరీరంలో అన్ని రకాల విధులు సరిగ్గా జరగాలన్నా రక్తం తప్పనిసరి. ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బీ 12 లోపం ఉన్నప్పుడు కూడా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్యతో బాధపడేవారు చాలా ఎక్కువ మంది అవుతున్నారు.

సరైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా రక్తహీనత సమస్యకు దారి తీస్తుంది. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల్లో కూడా ఈ సమస్య కనబడుతుంది.
గోళ్లు తెల్లగా పాలిపోవడం, నాలుక మీద‌, కనురెప్పల క్రింద భాగం తెల్లగా ఉండటం, బలహీనంగా ఉండటం, చిన్నచిన్న పనులకే అలసిపోవడం, ఆయాసం రావడం, ఏ ప‌ని చేయాల‌న్నా ఆసక్తి లేకపోవడం వంటి వాటిని ర‌క్త‌హీన‌త ల‌క్ష‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. రక్తహీనత సమస్యను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే అనేక ఇతర రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు రక్తహీనతకు చెక్ పెట్టే ఆహారాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రక్తహీనత లేదా ఐరన్ లోపంతో బాధపడేవారు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఆహారం విషయం అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఐరన్ లోపం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కోల్పోయి అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఖర్జూరం
ఖర్జూరంలో విటమిన్ ఏ, బి, సి, డి లతో పాటు కాల్షియమ్, ఫాస్ఫరస్,ఐరన్, ఫైబర్ కూడా ఉన్నాయి. అందుకే ఖర్జూరంను ప్రోటీన్స్ పవర్ హౌస్ అని అంటారు.ఖర్జూరంలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందించడమే కాకుండా.. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది.

నీరసంగా..శక్తిని కోల్పోయినట్లు ఉండేవారు ఖర్జూరం తింటే చాలు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఖర్జూరాలను రోజూ నానబెట్టి తింటే శరీరానికి బోలెడంత ఎనర్జీ వస్తుంది. విటమిన్ సప్లిమెంట్లతో పని ఉండదు.రక్తహీనతతో బాధపడేవారు ఖర్జూర పండ్లలో పాలు, మీగడ లేదా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచిది.

తక్షణ శక్తి కావాలంటే ఖర్జూరం తినాల్సిందే. దీనిలో ఉండే గ్లూకోజ్ తక్షణ శక్తిని ఇచ్చి మనల్ని చురుకుగా ఉండేలా చేస్తుంది. ఖర్జూరంలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.

అంజీర్
అందరికి అందరికి డ్రై ఫ్రూట్ గానే తెలుసు. ఈ అంజీర పండును మేడిపండు, అత్తిపండు, Indian Fig అని కూడా అంటారు. ఇందులో విటమిన్ ఏ, బి, బి 12, సి ఉంటాయి. వీటిలో కొవ్వు పిండి పదార్ధాలు కాల్షియమ్, ఐరన్, పొటాషియం, ఫైబర్ ఎక్కువ మోతాదులో కూడా ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటిఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

దీనిలో ఇంకా సెల్యూలోజ్ కూడా లభిస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికీ రోజు ఈ అంజీర పండ్లను (పచ్చివి లేదా ఎండినవి ) 3 లేదా 4 తీసుకోవటం వల్ల రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ స్థాయిలను బాగా పెంచుతుంది. ప్లేట్లెట్స్ తగ్గిన వారికీ కూడా ఇది చాల మంచిది అంజీర పండ్లలో ఐరన్, ప్రోటీన్లు, విటమిన్ బి ఉండడం వల్ల రక్త కణాలు పెరిగి రక్తహీనతను దూరం చేస్తుంది.

నువ్వు గింజలు
నువ్వు గింజలు ఇనుము, రాగి, జింక్, సెలీనియం మరియు విటమిన్ బి 6, ఫోలేట్ మరియు విటమిన్ E సమృద్దిగా ఉంటాయి. నలుపు నువ్వులలో తెల్లనువ్వులతో పోలిస్తే ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపరచడానికి మరియు ఇనుము యొక్క శోషణ ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.