Healthhealth tips in telugu

1 సారి-100%రోగనిరోదకశక్తిని పెంచి గ్యాస్,ఎసిడిటీ,కడుపు ఉబ్బరం,మంటనుతగ్గించి ఆకలి పెరిగేలా చేస్తుంది

Gas problem home remedy in telugu: ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక శక్తి పెంచుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఈ రోజుల్లో చాలా మందిని గ్యాస్, కడుపు ఉబ్బరం,కడుపులో మంట అనేవి వేదిస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటానికి మందులు వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
Gas problem home remedy in telugu
ఇప్పుడు చెప్పే చిట్కా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంటను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. దీని కోసం ఒక నిమ్మకాయను తీసుకొని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేయాలి. ఈ నిమ్మ ముక్కలపై కొంచెం మిరియాల పొడి,చిటికెడు ఉప్పు, కొంచెం శొంఠి పొడి జల్లాలి.

పొయ్యి మీద పెనం పెట్టి కాస్త వేడెక్కాక, పెనం మీద రెడీ చేసిన నిమ్మకాయ ముక్కలను పెట్టి కొంచెం సేపు వేడి చేస్తే నిమ్మకాయ ముక్క మీద జల్లిన ఉప్పు,మిరియాల పొడి, శొంఠి పొడి అన్నీ నిమ్మకాయలో కలుస్తాయి. ఈ నిమ్మకాయ ముక్కల నుండి రసాన్ని తీయాలి.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పైన తయారుచేసుకున్న నిమ్మరసం ఒక స్పూన్ వేసి కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ చిట్కా ఆకలి లేనివారికి ఆకలిని పుట్టిస్తుంది.

మిరియాలు, శొంఠి పొడిలో ఉన్న లక్షణాలు గ్యాస్ వంటి జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ మన ఇంటిలో అందుబాటులో ఉండేవే. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయ్యి ఈ సమస్యల నుండి బయట పడండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."