సొంత పేర్లనే సినిమా టైటిల్ గా పెట్టుకుని డిజాస్టర్ తెచ్చుకున్న హీరోలు

Tollywood Heroes :హీరోల పేరుతొ సినిమాలు రావడం సహజం. అయితే అలా వచ్చిన సినిమాల్లో చాలా వరకూ ప్లాప్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో 1985లో చిరంజీవి టైటిల్‌తోనే ఓ సినిమా చేసాడు. కన్నడ సినిమా నేనే రాజాకు రీమేక్ గా వచ్చిన ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో చిరంజీవి హీరో కమ్ విలన్.

ఇక జై చిరంజీవ మూవీ 2005లో విజయ్ భాస్కర్ తెరకెక్కించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించాడు. అయితే ఈ సినిమా అంచనా అందుకోలేదు. ఇక నందమూరి బాలకృష్ణను మొదట్లో యువరత్న అనే బిరుదు తగిలించి పిలిచేవారు. దాంతో తన బిరుదుతో యువరత్న రాణా అనే సినిమా చేస్తే అది కాస్తా డిజాస్టర్ అయింది.

అక్కినేని హీరో నాగార్జున 1986లో కెప్టెన్ నాగార్జున పేరుతో చేసిన సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఇక నాగార్జున తనయుడు అఖిల్ మొదటి సినిమా సొంత పేరుతో వచ్చి దారుణంగా నిరాశ పరిచింది. సొంత పేరులో రెండు అక్షరాలతో రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ మూవీ అంచనాలను తలకిందులు చేసింది. అలాగే నాగచైతన్య దో”చెయ్”, ఎన్టీఆర్ “kaNTRi” కూడా నిరాశపరిచాయి. అయితే వెంకటేష్ తన సొంత పేరు టైటిల్‌గా చేసిన సినిమా వెంకీ మామ యావరేజ్ గా నిల్చింది. మొత్తం మీద చాలామంది హీరోలకు సొంత పేర్లతో మూవీస్ ఏమాత్రం అచ్చిరాలేదు.