ఇంత స్టైల్‌గా ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఓ టాప్‌ హీరో…గుర్తు పట్టారా…?

Tollywood actor nikhil siddarth : సోషల్ మీడియాలో సెలబ్రిటీలు యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో ఫాన్స్ కి, హీరో హీరోయిన్స్ మధ్య గ్యాప్ కూడా బాగా తగ్గిపోయింది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్ నడిపిస్తున్నాయి.

ముఖ్యంగా హీరోయిన్స్ అనుసరించే ఈ పద్దతిని ప్రస్తుతం హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. దాంతో ఇప్పటి వరకు పలువురు హీరోలు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా, తాజాగా యంగ్‌ హీరో నిఖిల్‌ కూడా ఇదే బాట పట్టాడు. చిన్నతనంలో దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం నిఖిల్‌ కార్తికేయ 2తో పాటు ’18 పేజీస్‌’ బిజీగా ఉండడమే కాకుండా మరికొన్ని సినిమాలను కూడా చేతిలో పెట్టుకున్నాడని టాక్. గోల్డ్‌ కలర్‌ కోట్‌లో చిన్నప్పుడే హీరోలా కనిపిస్తున్న ఒక ఫోటోను నిఖిల్ పోస్ట్‌ చేస్తూ, ‘నాన్నతో నేను.. నేను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది’ అని పేర్కొన్నాడు. ఈ పాత జ్ఞాపకాన్ని తనకు అందించిన స్నేహితుడిని ట్యాగ్ చేశాడు నిఖిల్‌. దాంతో ఇక విపరీతంగా వైరల్ అవుతోంది.