Healthhealth tips in telugu

ఈ తొక్కలో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం

Bottle gourd peel Benefits in Telugu : మనం సాదరణంగా ఆనపకాయతో కూర చేసుకున్నప్పుడు తొక్క తీసి పాడేస్తూ ఉంటాం. అయితే ఆ తొక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆనపకాయ తొక్కలో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఆనపకాయ తొక్కలో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్స్ బి 1, బి 2, బి 3, బి 5, బి 6, కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం మరియు మాంగనీస్ సమృద్దిగా ఉంటాయి. ఆనపకాయ తొక్కలతో పప్పు,పచ్చడి చేసుకోవచ్చు. అలాగే జ్యూస్ తయారుచేసుకొని కూడా తాగవచ్చు.
Bottle Gourd Peel Benefits
ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయ పడుతుంది. ఆనపకాయ తొక్కలను ఎండలో ఎండబెట్టి మెత్తని పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. పైల్స్ సమస్య ఉన్నవారు ఒక గ్లాస్ నీటిలో పావుస్పూన్ ఆనపకాయ తొక్కల పొడిని కలిపి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

అధిక బరువు సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఆనపకాయ తొక్కలతో తయారుచేసిన జ్యూస్ తాగితే 15 రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది. ఆనపకాయ తొక్కలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో చిటికెడు పసుపు వేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీద నల్లని మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.