Healthhealth tips in telugu

భోజనం తర్వాత ఒక లడ్డు తింటే…పాదాల అరికాళ్ళ నుండి తల వరకు అన్ని వ్యాధులు నయం అవుతాయి

flax seeds laddu Benefits In telugu :కొంత మంది ఏ చిన్న పని చేసినా చాలా తొందరగా అలసిపోతారు. దానికి కారణం ఏమిటంటే శరీరానికి అవసరమైన శక్తి అందక పోవడం. ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకుంటే ఇటువంటి సమస్యలు ఉండవు. ఇటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఒక లడ్డు తయారు చేసుకుందాం.

ఈ లడ్డూను రోజుకి ఒకటి తింటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయట పడవచ్చు. దీనికోసం ముందుగా పాన్ వెలిగించి నూనె లేకుండా ఒక కప్పు flax seeds, ఒక కప్పు తెల్ల నువ్వులు వేసి సిమ్ లో పెట్టి వేగించాలి. వేగిన flax seeds, నువ్వులు కాస్త చల్లారాక మెత్తని పౌడర్ గా తయారు చేసుకోవాలి.బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి తురిమిన బెల్లాన్ని వేసి కొంచెం నీటిని కలిపి తీగ పాకం వచ్చేవరకు పొయ్యిమీద ఉంచాలి. తీగపాకం వచ్చాక దానిలో తయారుచేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టిన బాదంపప్పులను కూడా వేయాలి. మిశ్రమం బాగా కలిసేలా బాగా కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డుగా తయారు చేసుకోవాలి.

ప్రతిరోజు ఒక లడ్డు తింటూ ఉంటే రక్తహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం వంటివి ఏమీ ఉండవు. ఈ లడ్డులు ఒకసారి తయారు చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరు తినవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."