MoviesTollywood news in telugu

కల్యాణ్ రామ్ “బింబిసార” సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు

Kalyan Ram Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డిఫరెంట్ క్యారెక్టర్ తో రాబోతోంది. టైటిల్ కూడా విచిత్రంగానే ఉంది. ఈ సినిమాకు సంబంధించి ‘బింబిసార’ పోస్టర్స్‌తో పాటు తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టైటిల్ విచిత్రంగా ఉండడంతో ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. కొత్త దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తున్న ‘బింబిసార’ మూవీకి సంబంధించి తాజాగా విడుదలైన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది.

పునర్జన్మల నేపథ్యం ఉందని అంటున్న బింబిసార సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చారిత్రక నేపధ్యం గల ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ యుద్ధ విన్యాసాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బింబి సార చక్రవర్తి పాత్రలో కళ్యాణ్‌రామ్ నటిస్తుండగా, ఈ మూవీలో హీరోయిన్‌ కేథరిన్ జోడీ కడుతోంది. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ పేరును నిర్మాతగా పరిచయం చేస్తున్నారు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.

నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ పాన్ ఇండియన్ స్థాయిలో బింబిసార విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు రెండింతలు పెరిగిపోయాయి. అసలు విషయంలోకి వెళ్తే, మగధ సామ్రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశ రాజు బింబిసారుడు క్రీస్తు పూర్వం 558 లో భట్టియా అనే అధిపతికి జన్మించారు.

15 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించారు. మగధ సామ్రాజ్యం మొదటి రాజధాని రాజగృహ, ఆ తర్వాత పాటలీపుత్ర (పాట్నా) రాజధానిగా చేసుకొని పాలించారు. మగధ రాజ్య సింహాసనం అధిరోహించడానికి బింబిసారుడి కుమారుడు అజాతశత్రువే ఆయన్ను ఖైదుచేసి, తనకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత విడుదల చేయాలను కున్నప్పటికీ అప్పటికే బింబిసారుడు మరణించారు.

ఇది క్రీ.పూ. 491నాటి ఘటన. అయితే బుద్ధుని సమకాలికుడైన బింబి సారుడు ఏ మతాన్ని ఆదరించాడో స్పష్టత లేకున్నా ఎవరికి వారే తమ మతస్థుడిగా భావిస్తుంటారు. బీహార్, గంగానది దక్షిణ ప్రాంతాల్లో మగధ సామ్రాజ్యం విస్తరించి ఉండేది. కాగా కోసల రాజు మహా కోసల కుమార్తె కోసలా దేవిని బింబిసారుడు పెళ్లి చేసుకుని, ఆ తర్వాత లిచ్చావి రాజకుమారి చెల్లన, మద్రా రాజకుమారి క్షేమను పెళ్లాడారు. ఈయనకు 500 భార్యలు ఉన్నారట.