MoviesTollywood news in telugu

యముడి సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

yamudu Movies in Telugu : మన సినిమాల్లో యముడుతో ఆడుకునే రీతిలో సరదా సినిమాలు చాలానే వచ్చాయి. అందులో దాదాపు అన్నీ హిట్ అయ్యాయి. తాతినేని రామారావు డైరెక్షన్ లో వచ్చిన యమగోల మూవీ 1977లో బ్లాక్ బస్టర్. ఈ మూవీలో ఎన్టీఆర్ తో సమానంగా యముడిగా కైకాల సత్యనారాయణకు కూడా అంతటి పేరు తెచ్చింది. యమలోకంలో విప్లవాన్ని రగిల్చే విధంగా ఎన్టీఆర్ నటన అదిరిపోయింది.

ఇక 1988లో మెగాస్టార్ చిరంజీవి నటించిన యముడికి మొగుడు మూవీ సుప్రీం ఫిల్మ్స్ బ్యానర్ మీద తీశారు. చిరంజీవి ఫ్రెండ్స్ సుధాకర్, నారాయణరావు, హరిప్రసాద్ కల్సి తీసిన ఈ మూవీలో యముడితో మెగాస్టార్ ఎలా ఆడుకున్నాడో తెల్సిందే. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కైకాల సత్యనారాయణ యముడు పాత్రకు జీవం పోశారు.

అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన యమలీల మూవీలో కూడా అలీ నటన అద్భుతం. హీరోగా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇందులో కూడా యముడుగా సత్యనారాయణ నటించారు. ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి 2007లో తీసిన యమదొంగ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చెలరేగిపోయాడు.

ఇందులో మోహన్ బాబు యముడిగా నటించి మెప్పించాడు. అదే సమయంలో యమగోల మళ్ళీ మొదలైంది మూవీ వచ్చింది. శ్రీకాంత్, వేణు నటించిన ఈ మూవీ కూడా బాగానే ఆడింది. 2012లో యముడికి మొగుడు పేరుతొ అల్లరి నరేష్ హీరోగా కామెడీ ప్రధానంగా సినిమా వచ్చి, బాగానే అలరించింది. ఆతర్వాత సుమన్, కోట శ్రీనివాసరావు నటించిన యముడన్నకి మొగుడు మూవీ వచ్చింది. అయితే ఇది నిరాశ పరిచింది.