రావోయి చందమామ హీరో రియల్ లైఫ్ లో ఏమి చేస్తాడో తెలుసా?

Ravoyi Chandamama Serial Hero Real Life : ఈటీవీలో ప్రసారమవుతున్న రావోయి చందమామ సీరియల్ లో నటిస్తున్న శివరాం గురించి వివరాల్లోకి వెళ్తే, ఇతడి పూర్తిపేరు రవిశంకర్ రాథోడ్. అక్టోబర్ 1న తిరుపతిలో జన్మించిన యితడు తిరుపతిలోనే స్టడీస్ పూర్తిచేసాడు. ఇతడికి ఓ అన్నయ్య కూడా ఉన్నాడు.

డెంటల్ కోర్సు పూర్తిచేసి, ఆర్ ఎస్ ఆర్ డెంటల్ కేర్ లో వైద్యునిగా పనిచేసున్న రవి శంకర్ కి చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలనే కోరిక ఉంది. అయితే డాక్టర్ గా ఉంటూనే యాక్టింగ్ వైపు అడుగులు వేశారు. మొదటి సీరియల్ తోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్నాడు.

ఈటీవీలో ప్రసారమైన నాలుగు స్థంభాలాట సీరియల్ లో బాల అనే హీరో క్యారెక్టర్ రవిశంకర్ చేయగా, అయన తండ్రి కృష్ణ విలన్ గా చేయడం విశేషం. తర్వాత రావోయి చందమామ సీరియల్ లో శివరాం గా నటించి రవిశంకర్ మంచి ప్రేక్షకాదరణ పొందారు. ఇక జెమినిలో ఆనంద రాగం సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు.