భానుప్రియ సిస్టర్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Tollywood Heroine bhanu priya sister shanthi priya :తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్ గా ముద్ర వేసుకున్న భానుప్రియ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం తల్లి పాత్రలతో అదరగొడుతోంది. అయితే భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ కూడా ఒకప్పుడు హీరోయిన్ గా చేసి, ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే వెబ్ సిరీస్ తో ఆమె ఎంట్రీ ఇస్తోంది. వంశీ డైరెక్షన్ లో మహర్షి మూవీతో సుచిత్ర పాత్రతో టాలీవుడ్‌కు పరిచయమైన శాంతిప్రియ మంచి నటన కనబరిచింది.
ఆ తర్వాత సింహస్వప్నం, యమపాశం, నాకు పెళ్లాం కావాలి వంటి సినిమాల్లో నటించడమే కాదు తమిళ, హిందీ సినిమాల్లోనూ తన అభినయ ప్రతిభ చాటింది. అయితే ఇక్కేపే ఇక్కా అనే హిందీ మూవీ తర్వాత 1994లో సినిమా ఇండస్ట్రీ నుంచి సడన్ గా దూరం జరిగింది. 1999లో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ రేను వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఇక 2004లోనే ఆమె భర్త అనారోగ్య కారణాలతో కన్ను మూశాడు.
దీంతో తన ఇద్దరి పిల్లల పెంపకంలో బిజీ అయింది. పిల్లలు పెరిగి పెద్ద కావడంతో ఇప్పుడు స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇస్తోంది. సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో హిందీలో ‘ధారావి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్ ను సమిత్ కక్కడ్ దర్శకత్వంలో జీ స్డూడియోస్ నిర్మిస్తోంది. త్వరలోనే ‘ఎంఎక్స్ ప్లేయర్’ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్‌సిరీస్‌లో సోనాలీ కులకర్ణి, వివేక్ ఒబెరాయ్ తదితర ప్రముఖులు కన్పిస్తారు. కాగా దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ మేకప్ తో ఈ బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో నటిస్తూ శాంతిప్రియ ఎంట్రీ ఇస్తోంది.