రౌడీగారి పెళ్ళాం సీరియల్ ఈశ్వరి (అమిత కులాల్ )రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
Rowdy gari pellam serial eeshwari : వివిధ ఛానల్స్ లో వస్తున్న సీరియల్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో వెండితెరతో సమానంగా బుల్లితెర నటులకు ఇమేజ్ వస్తోంది. జి తెలుగు ఛానల్ లో తాజాగా మొదలైన రౌడీగారి పెళ్ళాం సీరియల్ లో హీరోయిన్ ఈశ్వరి తన అందంతో,అభినయంతో ఆకట్టుకుంటోంది. తెలుగులో తొలిసారిగా నటిస్తున్నా, మంచి పేరు తెచ్చుకుంది.
ఈశ్వరి అసలు పేరు అమిత సదాశివ కులాల్. ఈమె సదాశివ దంపతులకు మంగుళూరులో 1994లో జన్మించింది. ఈమెకు దీపక్ కులాల్ అనే బ్రదర్ ఉన్నాడు. అమిత స్టడీస్ మంగుళూరులోనే పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచి మోడలింగ్ మీద మక్కువ ఉండడంతో స్టడీస్ పూర్తయ్యాక ముంబైకి చేరింది.
ముంబైలో అమిత మోడలింగ్ చేస్తూనే సినీ ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసింది. 2017లో కన్నడ మూవీ రంగంలోకి అడుగుపెట్టింది. జగత్ కిలాడీ వంటి మూవీస్ లో చేసింది. పలు సీరియల్స్ లో కూడా చేసిన ఈమె ప్రస్తుతం తెలుగులో రౌడీగారి పెళ్ళాం సీరియల్ లో చేస్తోంది.