ఈ టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా….ఆలస్యం చేయకుండా చూసేయండి
Tollywood Hero Akhil : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలు సైతం విస్తృతంగా వాడేస్తున్నారు. అందుకే అన్ని విషయాలను ఫాన్స్ తో షేర్ చేసు కుంటున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ న్యూ లుక్ తో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.జిమ్‌లో కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్‌లో అఖిల్ కనిపిస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే, క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తీస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్… మూవీ కోసం అదిరిపోయే మేకోవర్‌లో కనిపించడానికి కసరత్తు చేస్తున్నాడు. షూటింగ్ ప్రారంభించే ముందే తన లుక్స్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి వస్తుంది. తాజాగా షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మారిన అఖిల్ తెగ కష్టపడుతున్నాడని తెలుస్తోంది. ఫాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు. కాగా ఈమధ్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో విజయాన్ని అందుకున్న అఖిల్ ఏజెంట్ గా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.