కరోనా తర్వాత దుమ్మురేపిన సినిమాలు…ఎన్ని ఉన్నాయో…?

Corona After Movies :మహమ్మారి కరోనా తో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అయితే వ్యాక్సినేషన్, కరోనా తగ్గుముఖం పట్టడం వలన ఒక్కో రంగం కోలుకొంటోంది. దీంతో సినిమా రంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కరోనాతో ఓటీటీలకు వీక్షకుల సంఖ్య భారీగా పెరగడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు బాగానే విడుదలయ్యాయి. ఇందులో కొన్ని సినిమాలే విజయాన్ని అందుకున్నాయి.

2020లో ఇవి ఓటీటీలో వచ్చిన సినిమాల్లో ఈ ఏడాది జనవరి 1న నాని ‘వి’, రాజ్‌ తరుణ్‌ నటించిన ఒరేయ్‌ బుజ్జిగా, ఎమ్మెస్‌ రాజు తెరకెక్కించిన డర్టీహరి, థియేటర్స్‌లోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ నుంచి తేరుకుని అప్పుడప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో రవితేజ నటించిన ‘క్రాక్‌’, రామ్‌ నటించిన రెడ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన అల్లుడు అదుర్స్‌ సంక్రాంతి కి రిలీజ్ కాగా,‘క్రాక్‌’ బాక్సాఫీసు దుమ్ము దులిపింది.

ఆ తర్వాతి నెలలో వచ్చిన 23 చిత్రాల్లో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టిల తొలి చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్ అయింది. ఇక అల్లరి నరేశ్‌ ‘నాంది’ కూడా బానే ఉంది. మార్చిలో వచ్చిన 20 చిత్రాల్లో శర్వానంద్‌ శ్రీకారం, శ్రీ విష్ణు ‘గాలి సంపత్‌’, నవీన్‌ పొలిశెట్టి జాతి రత్నాలు, కార్తికేయ చావు కబురు చల్లగా.., మంచు విష్ణు మోసగాళ్ళు, ఆది సాయికుమార్‌ శశి, నితిన్‌ ‘రంగ్‌ దే’, రానా అరణ్య, శ్రీసింహా ‘తెల్లవారితే గురువారం’ మూవీస్ లో జాతి రత్నాలు టాప్‌ ప్లేస్‌ దక్కించుకుంది.

సమ్మర్‌ అంటే ఇండస్ట్రీకి మంచి సీజన్‌. కానీ ఈ సీజన్‌ కరోనా భయంతో స్టార్ట్‌ కావడంతో థియేటర్స్‌లో పెద్దగా సినిమాలు రాలేదు. ఏప్రిల్‌ నెలలో విడుదలైన 12 చిత్రాల్లో నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’, పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌ లలో వకీల్‌ సాబ్‌ మంచి వసూళ్లు సాధించింది. వైల్డ్ డాగ్ పర్వాలేదని పించింది. తర్వాత కరోనా సెకండ్ వేవ్ తో మే, జూన్‌ నెలల్లో థియేటర్లకు తాళం పడింది.

లాక్‌ డౌన్‌ తర్వాత జూలై చివర్లో సత్యదేవ్‌ తిమ్మరుసు, తేజా సజ్జా ఇష్క్‌ వంటి మూవీస్ విడుదలయ్యాయి. ఆగస్టులో కిరణ్‌ అబ్బవరం ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’, విశ్వక్‌ సేన్‌ ‘పాగల్‌’, శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ ఆదరణ పొందగా .. . సుధీర్‌బాబు శ్రీదేవి సోడా సెంటర్‌ ఫర్వాలేదు. బాక్సాఫీస్‌ ఓ మోస్తరు విజయాలతో సాగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో గోపీచంద్‌ సీటీమార్‌ అదరగొట్టగా, నాగచైతన్య లవ్‌స్టోరీ మంచి వసూళ్లు తెచ్చింది.

ఇక అక్టోబరులో సాయిధరమ్‌ తేజ్‌ రిపబ్లిక్‌, అఖిల్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, రోషన్‌ పెళ్లి సందడి విజయాన్ని దక్కించుకున్నాయి. నవంబరులో దాదాపు 23 మూవీస్ లో ఏదీ సక్సెస్ సాధించలేదు. ఇక డిసెంబరు ఆరంభమే ‘అఖండ మూవీ బ్లాక్ బస్టర్ తో కలెక్షన్స్ వర్షం కురిపించగా, తర్వాత వచ్చిన అల్లు అర్జున్‌ పుష్ప దుమ్మురేపుతోంది. నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ కూడా విజయాన్ని కొనసాగిస్తోంది. ఈ నెలాఖర్లో రానా ‘1945’, శ్రీ విష్ణు ‘అర్జుణ ఫల్గుణ’, కీర్తీ సురేష్‌ ‘గుడ్‌లుక్‌ సఖి’ రిలీజ్ అవుతాయని టాక్.

ఇక ఓటిటిలో వెంకటేశ్‌ నటించిన నారప్ప, దృశ్యం 2లతో పాటు తెలుగులోకి అనువాదమైన సూర్య నటించిన డబ్బింగ్ మూవీ జై భీమ్‌ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. నితిన్‌ నటించిన మ్యాస్ట్రో’ ఫర్వాలేదనిపించుకుంది. చిన్నసినిమాల్లో థ్యాంక్యూ బ్రదర్‌, బట్టల రామస్వామి బయోపిక్కు, సినిమా బండి మంచి ఆదరణ పొందాయి. నాని నటించిన టక్‌ జగదీష్‌, రాజ్‌ తరుణ్‌ నటించిన పవర్‌ ప్లే, సంతోష్‌ శోభన్‌ నటించిన ఏక్‌ మినీ కథ, శివానీ రాజశేఖర్‌ నటించిన అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, సుహాస్‌ నటించిన ఫ్యామిలీ డ్రామా, సత్య నటించిన వివాహభోజనంబు, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి నటించిన అన్‌హార్డ్‌, నవీన్‌చంద్ర నటించిన సూపర్‌ ఓవర్‌, చిల్‌ బ్రో, సముద్రఖని ఆకాశవాణి, కార్తీక్‌రత్నం అర్ధ శతాబ్దం, రామ్స్‌ పచ్చీస్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివ్య క్యాబ్‌ స్టోరీస్‌ ఓటిటి లో వచ్చాయి.

కాగా ఈ ఏడాది అనువాద చిత్రాలు 50 వరకూ ఉన్నాయి. ఇందులో హీరో విజయ్‌ ‘మాస్టర్‌’ ఓ మోస్తరుగా లాగింది. అలాగే దర్శన్‌ ‘రాబర్ట్‌’, కార్తీ ‘సుల్తాన్‌’, ఏఆర్‌ రెహమాన్‌ నిర్మించిన ‘99 సాంగ్స్‌’, సిద్ధార్థ్‌ ‘ఒరేయ్‌…బామ్మర్ది’, విజయ్‌ సేతుపతి ‘లాభం’, విజయ్‌ ఆంటోనీ ‘విజయ రాఘవన్‌’ విడుదలయ్యాయి.

అయితే కంగనా రనౌత్‌ ‘తలైవి’, శివ కార్తికేయన్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’లు ఆకట్టుకోగలిగాయి. పెద్ద చిత్రాల్లో రజనీకాంత్‌ ‘పెద్దన్న’, శివరాజ్‌కుమార్‌ ‘జె భజరంగీ’, మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’ చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. హాలీవుడ్‌ తెలుగు అనువాదాల్లో ‘గాడ్జిల్లా వర్సెస్‌ కింగ్‌ కాంగ్‌’, ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’ మంచి కలెక్షన్స్ రాబట్టాయి.