MoviesTollywood news in telugu

గుప్పెడంత మనసు సీరియల్ గౌతమ్ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Guppedantha manasu serial actor gowtham : వివిధ ఎంటర్టైన్ మెంట్ ఛానల్స్ లో సీరియల్స్ కి మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో పోటాపోటీగా సీరియల్స్ ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ లో నటీనటులు తమ నటనతో ఆకట్టుకుంటున్నారు.

కొద్దిరోజుల్లోనే ఈ సీరియల్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో రిషి ఫ్రెండ్ గా నటిస్తున్న గౌతమ్ తన అందంతో, అభినయంతో ఆకట్టుకుని మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. గౌతమ్ అసలు పేరు కిరణ్ కాంత్. జనవరి 18న విజయవాడలో జన్మించాడు. విశ్వభారతి హైస్కూల్, శ్రీ చైతన్య, కె ఎల్ యు యూనివర్సిటీ లలో స్టడీస్ పూర్తి చేసాడు.

బిటెక్ అయ్యాక నటనపై గల ఆసక్తితో ఆ దిశగా అడుగులు వేసాడు. మొదట సత్తా, నామనసు నాదికాదు, ఖిలాడీ, ప్రేమలో సీతతో శ్రీరామ్ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఇతడికి ప్రేరణి అనే ఆమెతో పెళ్లయింది. ఇక షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో జానకీరాముడు మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. క్రేజ్ మేటర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించిన కిరణ్ కాంత్ తర్వాత స్టార్ మాలో ఉయ్యాలా జంపాల సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పౌర్ణమి, అమ్మ, అక్క మొగుడు వంటి సీరియల్స్ లో చేసాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."