రానా కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో…?

Rana hits and flops : మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనుమడు, నిర్మాత దగ్గుబాటి సురేష్ తనయుడు రానా .. లీడర్ మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పాజిటివ్, నెగెటివ్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలిసినిమా లీడర్ హిట్ కాగా, తర్వాత చేసిన నేను రాక్షసి మూవీ ప్లాప్ అయింది.

నా ఇష్టం మూవీ కూడా ప్లాప్ కాగా కృష్ణం వందే జగద్గురుమ్ మూవీ ఏవరేజ్ అయింది. బాహుబలి ది బిగినింగ్ మూవీలో నెగెటివ్ రోల్ చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రుద్రమదేవి మూవీ హిట్ అయింది. ఘాజీ సూపర్ హిట్ అయింది. బాహుబలి ది కంక్లూజన్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అయింది.

నేనే రాజు నేనే మంత్రి మూవీ సూపర్ హిట్ కాగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, అరణ్య మూవీస్ ప్లాప్ అయ్యాయి. 1945 కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ తో కల్సి చేస్తున్న బీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సి ఉంది.