సల్మాన్ ఖాన్ ఒక రోజు సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే

Bollywood Hero Salman khan : హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ అదిరిపోతున్నాయి. సినిమా సినిమాకు రేంజ్ పెరిగిపోవడం, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ వీలైనంత ఎక్కువగా రాబట్టుకోవాలని చూస్తున్నారు. అంతేకాదు, బుల్లితెర షోస్ లో హోస్ట్ లుగా, యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నారు.

ఇక బాలీవుడ్ లో కూడా అలాగే ఉంది. అక్కడ స్టార్ హీరోల సంపాదన మాములు రేంజ్ లో ఉండడం లేదు. అందులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకడు. ప్రస్తుతం కత్రినా కైఫ్ తో కల్సి టైగర్ 3మూవీ చేస్తున్న సల్మాన్ టాలీవుడ్ లో కూడా మెగాస్టార్ తో కల్సి గాడ్ ఫాదర్ మూవీలో చేస్తున్నాడు.

అలాగే విక్టరీ వెంకటేష్ మూవీలో కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4నుంచి హిందీలో హోస్ట్ గా చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఇతడి ఆస్తుల గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇతడి రోజువారీగా సంపాదన లెక్కేస్తే చాలామంది బతకవచ్చన్న కామెంట్స్ వస్తున్నాయి.

బిగ్ బాస్ షో కి 2010 నుంచి హోస్ట్ గా చేస్తున్న సల్మాన్ ఒక్కో వారానికి పాతిక కోట్లు అందుకుంటాడని టాక్. 14 వారాలకు 350కోట్లు అందుకున్నట్లు చెబుతున్నారు. పైగా వారాంతంలో కేవలం 2రోజులు మాత్రమే సల్మాన్ సందడి కన్పిస్తుంది. సినిమాల ద్వారా హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుఉంటున్నాడు. ఇలా అన్నే లెక్కేస్తే రోజుకి మూడు కోట్ల పైనే ఉంటుందని, అందుకే కోటానుకోట్ల విలువైన ఆస్తులు కొన్నట్లు బాలీవుడ్ సర్కిల్స్ లో విన్పిస్తున్న మాట.