మహేష్ బావ కంటే కృతికి ఎక్కువ రెమ్యునరేషన్…నిజం ఎంత…?

Tollywood heroine krithi shetty remuneration : మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన మూవీ బ్లాక్ బస్టర్ అయింది. కరోనా తొలిదశ తర్వాత వచ్చిన మూవీస్ లో మంచి విజయాన్ని అందుకున్న జాబితాలో చేరిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి తన అందంతో ,అభినయంతో యువ హృదయాలను కొల్లగొట్టింది.

అంతేకాదు, బేబమ్మగా ఇండస్ట్రీలో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరోలకు ధీటుగా రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోందని టాక్. ఎందుకంటే ఉప్పెనలో కృతి నటనకు మెచ్చి వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక రెండవ సినిమా శ్యామ్ సింగరాయ లో కూడా నటించి రొమాంటిక్స్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బావ సుధీర్ బాబు హీరోగా చేస్తున్న .. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీలో చేస్తోంది. ఇందులో సుధీర్ బాబు కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ కృతికి ఇస్తున్నారట. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ఒక కోటి 75లక్షల నుంచి 2కోట్ల వరకూ అందుకుంటోందని టాక్.