మహేష్ బాబు ఫెవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, రష్మికా మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తొలి వారం రోజులలోనే 100 కోట్ల షేర్ క్రాస్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబడుతుంది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ అంతా కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వరంగల్‌లో సినిమా విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

అయితే తాజాగా మహేశ్ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్‌లో భాగంగా చిన్నారులు ఆద్య, సితారకు ఇచ్చిన ఇంటర్వ్యూ తనకు ప్రత్యేకమని ట్విట్టర్‌లో తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూ గురుంచి మాట్లాడితే దర్శకుడు వంశీ పైడిపల్లి ఏ అండ్‌ ఎస్‌ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు. అయితే మహేశ్ కూతురు సితార, వంశీ కూతురు ఆద్య ఇందులో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తుంటారు. అయితే ఈ పిల్లలిద్దరు కలిసి మహేశ్ బాబును ఇంటర్వ్యూ చేశారు. సరిలేరు నీకెవ్వరులో ఆర్మీ జవాన్‌గా నటించడం మీకు ఎలా అనిపించిందని అడగగా మహేశ్ చాలా గర్వంగా ఉందని బదులిచ్చారు. అయితే మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరని అడిగితే మహేశ్ దానికి నవ్వుతూ ప్రస్తుతానికి రష్మిక నా ఫేవరెట్ కోస్టార్ అంటూ సమాధానమిచ్చారు. అయితే ఈ వీడియోను మహేశ్ ట్వీట్ చేస్తూ చిన్నారులకు ఇంటర్వ్యూ ఇవ్వడం సంతోషంగా ఉందని, చిన్నారులిద్దరికి నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని తెలిపారు.