మన స్టార్ హీరోల బలహీనతలు చూసి షాక్ అవుతున్న సినీ ఇండస్ట్రీ

తెరమీద హీరోలు చేసే సాహసాలు చూసి ఫాన్స్ మురిసిపోతుంటారు. కానీ వాళ్ళు కూడా మామూలు మనుషులేనని,వారికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయని చాలామందికి తెలియదు. అయితే హీరోలకున్న కొన్ని బలహీనతలు అప్పుడప్పుడూ బయట పడుతూ ఉంటాయి. తెరపై యాంగ్రీ మాన్ గా ఉండే నందమూరి బాలకృష్ణకు ముక్కుమీద కోపం ఎక్కువే. ఇక జాతకాలపై ఎక్కువ నమ్మకం ఉన్నవాడు. సినిమా షూటింగ్ కి వెళ్లినా, ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా సరే, జాతకం చూసివెళ్తారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి సిగరెట్ అలవాటు ఎక్కువ ఉండేదట. అయితే ఈ అలవాటుని మానెయ్యడానికి ఎక్కువ సమయం పట్టిందట. షూటింగ్ స్పాట్ లో సంబంధం లేని వ్యక్తులుంటే అసలు సహించడట. అక్కడ నుంచి వెళ్ళిపోతాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై జనసేన పార్టీ పెట్టి రాజకీయాలు చేసుకుంటున్నారు. అయితే దిల్ రాజు తీయబోతే పింక్ రీమేక్ లో పవన్ నటిస్తాడని టాక్ . స్క్రిప్ట్ నుంచి డైరెక్షన్ వరకూ అన్నీ పరిక్షిస్తారు.

సెట్ లో డైరెక్టర్ ని ప్రతీ సీన్ గురించి అడిగి తెలుసుకుంటాడట. అన్నింటా సన్నివేశం అలా ఉందేంటి అని నిలదీస్తాడట. కొన్ని సీన్స్ అవసరమైతే మళ్ళీ తీయిస్తాడట. డైరెక్షన్ లో ఎక్కువ జోక్యం చేసుకుంటాడని అంటుంటారు. అందుకే సినిమాలు ప్లాప్ అవుతుంటాయని టాక్. జూనియర్ ఎన్టీఆర్ మంచి వక్త. షూటింగ్ లోకి ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే చాలా సిగ్గుపడడం,మొహమాట పడడం అలవాటట. షూటింగ్ లో అందరినీ ఆటపట్టిస్తాడట. ఇక అల్లరి కూడా ఎక్కువేనట. ప్రభాస్ కి సిగ్గు ఎక్కువట. పెద్ద సీన్స్ చేసేటప్పుడు ఎవ్వరినీ సెట్ లో ఉంచరట. ప్రభాస్ డార్లింగ్ కి కాస్త బద్ధకం కూడా ఎక్కువట.