అందాల చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా…?

Tollywood heroine megha akash : సోషల్ మీడియాలో రోజూ ఎవరో ఒక హీరోయిన్ చైల్డ్ డేస్ ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా క్రేజీ స్టార్ హీరోయిన్ మేఘా ఆకాష్ చిన్నప్పటి ఫోటో వైరల్ గా మారింది. ఇటీవల తెలుగులో రాజ రాజ చొర సినిమాతో తొలి హిట్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పిస్తోంది.

ప్రస్తుతం మను చరిత్ర, యాదుం ఊరే యావరుం కేలిర్, గుర్తుందా శీతాకాలం, అక్టోబర్ 31 లేడీస్ నైట్ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే యంగ్ హీరోలతో జోడీకట్టి మెప్పించిన ఈ క్రేజీ హీరోయిన్ మొదటి సినిమాతోనే యువ హృదయాలలో చోటు సంపాదించుకుంది.

అటు గ్లామర్ పాత్రలతో పాటు.. ఇటు నటనకు కూడా స్కోప్ గల పాత్రలలో నటిస్తూ తన కెరీర్‌ సాగిస్తున్న ఈ భామ నితిన్ హీరోగా వచ్చిన లై మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నితిన్ తోనే ఛల్ మోహన రంగా మూవీలో కూడా చేసింది. మేఘా చిన్నప్పటి ఫోటోకి సో క్యూట్ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.