ప్రేమాభిషేకం సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

Premabhishekam Movie : డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ ప్రధాన పాత్రల్లో క్యాన్సర్ అంశంతో వచ్చిన ప్రేమాభిషేకం సినిమా అప్పట్లో సంచలనం. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ మూవీలో మోహన్ బాబు, మురళీమోహన్ కీలక పాత్రలు చేసారు. ఇక ఈ మూవీ 1981ఫిబ్రవరి 18న రిలీజయింది.

చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు ఎసెట్. దేవదాసు వాసన కన్పించకుండా కమర్షియల్ విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కినేని నటన అద్భుతం. పాత రికార్డులను చెరిపేసి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ప్రేమాభిషేకం సినిమా 86సెంటర్స్ లో 50డేస్, 43సెంటర్స్ లో 100డేస్, 32సెంటర్స్ లో 175డేస్, 22సెంటర్స్ లో 200డేస్, 13సెంటర్స్ లో 250డేస్, 11సెంటర్స్ లో 300డేస్ ఆడింది.

హైదరాబాద్ లో 500రోజులు ఆడి ప్లాటినం జూబ్లీ కూడా చేసుకుంది. కోటిన్నరకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీనికి రెండు వారాల గ్యాప్ తో ఫిబ్రవరి 6న చిరంజీవి నటించిన పార్వతీ పరమేశ్వరులు మూవీ వచ్చింది. శివుడి గెటప్ లో చిరంజీవి అలరించినప్పటికీ సినిమా ప్లాప్ అయింది. స్వప్న హీరోయిన్.

అదే రోజు మురళీమోహన్ నటించిన ఆశాజ్యోతి మూవీ రిలీజయింది. సుజాత, శరత్ బాబు నటించిన ఈ లవ్ స్టోరీ మూవీని దర్శకుడు తాతినేని ప్రకాశరావు తెరకెక్కించారు. ప్రేమాభిషేకానికి 6రోజుల ముందు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి నటించిన తోడుదొంగలు మూవీ రిలీజయింది. కె వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. ప్రేమాభిషేకం వచ్చిన రెండు వారాల తర్వాత ఎవరు దేవుడు మూవీ వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీని ఏ భీం సింగ్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ నిరాశ పరచడంతో ప్రేమాభిషేకం నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది.