MoviesTollywood news in telugu

వదినమ్మ సీరియల్ నుండి వెళ్లిపోవటానికి అసలు కారణం ఇదే

vadinamma Serial Today episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న వదినమ్మ సీరియల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సీరియల్ మొదలైన కొన్ని రోజులకే బుల్లితెర ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో నటీనటులు తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. దాంతో ఈ సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ లో దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది.

పాత్రలు మార్చడం గానీ, నటీనటులను మార్చడం గానీ చేయకపోయినా ఒక్కసారిగా ఎందుకు రేటింగ్ పడిపోయిందనే విషయంపై చర్చ నడుస్తోంది. అప్పుడు విషయం తెల్సింది. అదేమిటంటే లక్ష్మణ్ క్యారెక్టర్ లో నటిస్తున్న వ్యక్తి కన్పించడం లేదు. అతడి పేరు రాజేష్. అయితే రాజేష్ స్థానంలో లక్ష్మణ్ పాత్రలో మరొక నటుడు కనిపిస్తున్నాడు.

ఈటీవీలో ప్రసారమయ్యే రంగుల రాట్నం సీరియల్ లో హీరోగా నటించే ఛాన్స్ రావడంతో రాజేష్ అందులోకి వెళ్లిపోయాడని అందుకే వదినమ్మ సీరియల్ లో మానేశాడని వివరణ వచ్చింది. దానికి తోడు వెబ్ సిరీస్, సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా రాజేష్ కి వస్తున్నాయట. సమయం సరికిపోక పోవడంతో వదినమ్మ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు రాజేష్ చెప్పుకొచ్చాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."