Healthhealth tips in telugu

15 రోజులు-అధిక బరువు,శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు,కొలెస్ట్రాల్ ,జీర్ణ సమస్యలు ఉండవు

Apple Tea Benefits In telugu : యాపిల్ పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. యాపిల్ టీ ప్రతి రోజు తాగితే అధిక బరువు సమస్య, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. .

బరువు ఆరోగ్యకరమైన రీతిలో మాత్రమే తగ్గాలి. బరువు తగ్గినప్పుడు .నీరసం రాకుండా కూడా చూసుకోవాలి. ఈరోజు .యాపిల్ టీ తయారు చేసుకుందాం. దీని కోసం యాపిల్ ని తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత అల్లం కూడా తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. ఈ రెండింటిని నీటిలో ఉడికించి కాస్త చల్లారనివ్వాలి. .

ఆ తర్వాత స్మూత్ జ్యూస్ అయ్యేవరకు గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టకుండా కూడా తీసుకోవచ్చు. పదిహేను రోజులపాటు తీసుకుంటే ఆ తేడా మీరే గమనిస్తారు. వచ్చిన తేడాను బట్టి మీరు ఇంకా ఎన్ని రోజులు యాపిల్ టీ తాగితే మంచిదో మీకే అర్థమవుతుంది.

ఈ యాపిల్ టీ తాగడం వలన అధిక బరువు సమస్య తగ్గడమే కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ నియంత్రణ, కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తసరఫరా బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.