Healthhealth tips in telugu

నెల రోజులు – సైనస్,ముక్కు దిబ్బడ,తలనొప్పి,గొంతు నొప్పి ,అలసట అన్ని తొలగిపోయి జీవితంలో రాదు

Sinus Pain Home Remedies : సైనస్ సమస్య ఉంటే తరచుగా జలుబు, ముక్కు మూసుకుపోవడం వంటివి జరుగుతాయి. సైనస్ ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్సలే లేవు. సైనస్ అన్నవి ముక్కులో ఉండే చిన్నని కుహరములు. ముక్కు, గొంతుకకు మధ్య ఉంటాయి.
Diabetes patients eat almonds In Telugu
ఇవి గాలితో నిండి ఉంటాయి. శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ శ్లేష్మం ముక్కు రంధ్రాల్లోంచి వచ్చే అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలను అడ్డుకుంటుంది. నాసికా కుహరముల మధ్యనుండే కణజాలం వాచిపోవడాన్ని సైనసైటిస్ గా పేర్కొంటారు. కణజాలం వాచిపోవడంతో నాసికా కుహరములు బ్లాక్ అవుతాయి. దీంతో శ్లేష్మం, గాలి బంధించినట్టు అవుతుంది. దీనివల్ల నొప్పి, ఒత్తిడి కలుగుతుంది.

సైనస్ సమస్య చల్లని వాతారవరణం ఉన్నప్పుడు చాలాఎక్కువ అవుతుంది. సైనస్ సమస్య ఉన్నప్పుడు తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కులో నొప్పి, గొంతు నొప్పి, ముఖంలో వాపు, జ్వరం, అలసట, దగ్గు, ముక్కు కారడం, వాసన గ్రహించకపోవడం వంటి సమస్యలువస్తాయి. ఈ సమస్యకు ఇప్పుడు చెప్పే పాలను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

పొయ్యి మీద గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి కొంచెం వేడి అయ్యాక మూడు బాదం పప్పులను తురిమి వేయాలి. ఆ తర్వాత 3 మిరియాలను క్రష్ చేసి వేయాలి. ఆ తర్వాత చిన్న పటికబెల్లం ముక్కను వేసి 3 నిమిషాల పాటు మరిగించి తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే సైనస్, ముక్కు దిబ్బడ,తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి.