Healthhealth tips in telugu

ఈ మొక్క మీ ఇంటిలో ఉంటే శరీరంలో వచ్చే నరాలు,కండరాలు,గ్యాస్,మోకాలు నొప్పి అన్ని నయం అవుతాయి

Ajwain leaves Benefits : సీజనల్ గా వచ్చే వ్యాధులను తగ్గించడానికి ఈ మొక్క చాలా బాగా సహాయపడుతుంది. ఈ మొక్క ఎన్నో వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ మొక్క పేరు వాము మొక్క. ఈ మొక్క కూడా చాలా సులభంగా పెరుగుతుంది. వాము ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వామాకుతో బజ్జీలు., పచ్చడి చేసుకోవచ్చు.
vaamu leaf
వాము ఆకు రసంలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దగ్గు., జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. వాము ఏకును నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. తల నొప్పిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

వాము ఆకును దంచి తీసిన రసాన్ని తల నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. వాము ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల శరీరంలో అన్ని రకాల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. వాము ఆకులలో గామా – లినోలెనిక్ వంటి ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.

అందువల్ల అన్నీ రకాల నొప్పులను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. గామా – లినోలెనిక్ యాసిడ్ కీళ్లనొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో విషాలను, మలినాలను తొలగించటానికి సహాయపడుతుంది.