మలబద్ధకం సమస్యతో చాలా ఇబ్బందిగా ఉందా… ఈ టిప్స్ ట్రై చేయండి
Malabaddakam samasya ayurveda chitkalu : ఈ మధ్య కాలంలో మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మలబద్ధకం సమస్యను అశ్రద్ధ చేస్తే అది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్య మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే కడుపు నొప్పి రావడమే కాకుండా పేగులకు తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ సమస్య తగ్గాలంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని త్రాగటం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా భోజనానికి ముందు తర్వాత కూడా మంచి నీటిని తాగాలి.
కొంతమంది భోజనం తర్వాత నీటిని తాగరు. అది చాలా తప్పు. తప్పనిసరిగా నీటిని తాగాలి. ఒక స్పూను నేతిలో బెల్లం కలిపి తింటే మలబద్ధకం సమస్య నుంచి బయట పడవచ్చు. బెల్లం, నెయ్యి ఈ రెండింటిలో ఉన్న పోషకాలు మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. అయితే బెల్లం, నెయ్యి కలిపి ఎప్పుడు తీసుకోవాలి అనే విషయంలో సందేహం ఉండవచ్చు.
దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. అప్పుడు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్ మరియు మసాలా వంటకాలకు దూరంగా ఉండాలి. ఈ విధంగా పాటిస్తే మలబద్దకం సమస్య దూరమవుతుంది.