Healthhealth tips in telugu

రోజుకి 2 తింటే చాలు కంటిలో మచ్చలు, సైట్, దృష్టి లోపాలు వంటి కంటి సమస్యలకు చెక్

Goji berries : Goji Berries తింటే అన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇవి ఈ మధ్య కాలంలో online stores లో విరివిగానే లభిస్తున్నాయి. ఇతర బెర్రీ ఫ్రూట్స్ తో పోల్చితే ఈ గోజిబెర్రీ ఫ్రూట్స్ లో విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుచేతనే వీటిని రోజుకు కనీసం రెండు తినమని నిపుణులు చెప్పుతు ఉంటారు.
goji berry benefits
శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. వీటిలో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అధిక బరువు సమస్యతో ఉన్నవారు Goji Berries తీసుకుంటే వాటిలో ఉండే రుచి మరియు ఫైబర్ కంటెంట్ పొట్ట నిండుగా, తొందరగా ఆకలి కాకుండా చేస్తుంది. వీటిలోని వివిధ అమైనో ఆమ్లాలు శరీరంలోని కొవ్వుని వేగంగా కరిగిస్తాయి. కండరాల పునరుత్పత్తి మరియు పెరుగుదలకు సహాయపడతాయి.లివర్ కి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గోజీ బెర్రీ నిరాశ, ఆందోళన మరియు ఇతర మానసిక సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. వీటిల్లో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే విటమిన్ ఏ సమృద్దిగా ఉండుట వలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్లను మించిన మేలు గోజి బెర్రీలు చేస్తాయి.

కళ్లల్లో మచ్చలు రావడం, సైట్ రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా అడ్డుకుంటుంది. మధ్య వయసు నుంచే వీటిని తినడం ప్రారంభిస్తే పెద్ద వయసు వచ్చేటప్పుడు ఎలాంటి కంటి సమస్యలు, చూపు లోపాలు లేకుండా హాయిగా జీవించవచ్చు. గోజీబెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్లు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. వృద్ధాప్యంలో చూపును రక్షించడంలో సహాయపడతాయి.