Healthhealth tips in telugu

నువ్వులు + బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

sesame seeds and jaggery benefits : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు బెల్లం., నువ్వులు కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ఈ ఆహారంను సూపర్ ఫుడ్ గా నిపుణులు చెబుతున్నారు.

నువ్వులలో ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. నువ్వులు గుండె జబ్బులు., మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల వంటి వాటిని తగ్గిస్తాయి. బెల్లంలో యాంటీఆక్సిడెంట్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులు, చిన్న బెల్లం ముక్క తింటే మంచి ప్రయోజనము ఉంటుంది.

అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నువ్వులలో ఉండే సెసామిన్ అనే సమ్మేళనం కీళ్ల నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బెల్లం జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేసి పోషకాలను గ్రహించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. జీవప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. నువ్వులలో పుష్కలంగా ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.

జుట్టు డ్యామేజ్‌ని రిపేర్ చేస్తుంది. నువ్వులు తల మీద చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయి. హెయిర్ ఫోలికల్స్‌ను పునరుద్ధరించడానికి రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.