Healthhealth tips in telugu

ఈ 6 పండ్ల‌ను తొక్క తీయ‌కుండానే తినాలట… ఎందుకో తెలుసా?!

త‌ర‌చూ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఒక్కో ర‌క‌మైన పండును తిన‌డం వ‌ల్ల అనేక విధాలైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క‌పోష‌కాలు కూడా అందుతాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని ర‌కాల పండ్ల‌ను మాత్రం మ‌నం తొక్క తీయ‌కుండానే తినాల‌ట. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అలా తొక్క తీయ‌కుండా తింటేనే ఆ పండ్ల వ‌ల్ల మ‌న‌కు పూర్తి స్థాయిలో లాభాలు క‌లుగుతాయ‌ట‌. మ‌రి అలా తొక్క తీయ‌కుండా తినాల్సిన పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
apple
యాపిల్స్‌:
యాపిల్ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. అయితే ఇవి యాపిల్ పండ్ల‌లో ఎలా ఉంటాయో వాటి తొక్క‌లో కూడా అంతే విధంగా ఉంటాయి. అందుకే వీటిని తొక్క తీయ‌కుండా అలాగే తినాలి. దీని వ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. త‌ద్వారా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
Pear Fruits Benefits In telugu
పియర్స్:
ఈ పండ్ల‌ను కూడా మ‌నం తొక్క తీయ‌కుండానే తినాలి. దీని వ‌ల్ల ఆ తొక్క‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మ‌న శ‌రీరానికి అందుతాయి. అంతేకాదు, పియ‌ర్స్ పండ్ల తొక్క‌లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు మెండుగా ఉంటాయి. అందువ‌ల్ల అవి మ‌న‌కు క‌లిగే వాపుల‌ను, నొప్పుల‌ను త‌గ్గించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
sapota
సపోట:
చాలా మంది స‌పోటా పండ్ల‌ను తొక్క తీసి తింటారు. అయితే అలా కాకుండా తొక్క‌తోనే నేరుగా తినాలి. దీని వ‌ల్ల జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. దీంతోపాటు పొటాషియం, ఐర‌న్‌, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీల‌క పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి.
plum fruit
ప్ల‌మ్స్:
ఈ పండును తొక్క తీయ‌కుండా తింటే దాంతో ఆ తొక్క‌లో ఉండే ఔషధ గుణాలు ఆందోళ‌న‌ను, ఒత్తిడిని దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం తొల‌గిపోతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు మాయ‌మ‌వుతాయి.
Kiwi fruit
కివీలు:
ఈ పండ్ల‌ను కూడా చాలా మంది తొక్క తీసి తింటారు. కానీ అలా చేయ‌కూడ‌దు. కివీ పండ్ల‌ను తొక్క‌తోనే తినాలి. దీంతో విట‌మిన్ సి పుష్క‌లంగా ల‌భిస్తుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు మాయ‌మ‌వుతాయి.
mango
మామిడి పండ్లు:
మామిడి పండ్ల‌ను తొక్క‌తో అలాగే తినాలి. దీని వ‌ల్ల వాటిలో ఉండే కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్‌, ఒమెగా-3, ఒమెగా-6 యాసిడ్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. అవి క్యాన్స‌ర్‌, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బుల‌ను దూరం చేస్తాయి.