Beauty Tips

ఈ పొడితో ఇలా చేస్తే పగిలిన,నల్లగా ఉన్న పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి

Cracked Lips Tips : వేసవికాలంలో వేడి కారణంగా ఎన్నో రకాల చర్మ సమస్యలు వస్తాయి. వాటిలో పెదాలు పగలటం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. పెదాలు పొడిగా మారి పగలటం వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెదాలు పగలకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే పగిలిన పెదాలు మృదువుగా మారటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
Dry lips beauty tips
తేనె పెదాలకు సహజ సిద్దమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పెదాలకు తేనె రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం,సాయంత్రం చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. తేనె పొడిబారిన పెదాలకు తెమను అందించి మృదువుగా మారుస్తుంది.

కొబ్బరి నూనె,పెట్రోలియం జెల్లీ రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకొని బాగా కలిపి గాలి చొరబడని సీసాలో పోసి అరగంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. దీనిని పెదాలకు రాస్తూ ఉంటే పగిలిన పెదాలు మృదువుగా మారతాయి.

ఒక బౌల్ లో 2 టీస్పూన్ల ఆలివ్ అయిల్, 1 టీస్పూన్ కొబ్బరి నూనె, 1 టీస్పూన్ కోకో పౌడర్, 1 టీస్పూన్ జోజోబా ఆయిల్, కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపుకోవాలి. బాగా మిక్స్ చేసి లిప్ బామ్ ట్యూబ్స్ లో పోయాలి. దీనిని పెదాలపై రాసుకుంటే పగిలిన పెదాలు మృదువుగా మారతాయి. ఎండ వేడి నుండి కూడా రక్షణ కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.