Healthhealth tips in telugu

ఈ పొడి జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు సమస్యలు లేకుండా చేస్తుంది

Nutmeg In Telugu :మతిమరుపు అనేది ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనపడేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 30 నుంచి 40 ఏళ్లు వచ్చేసరికి మతిమరుపు వచ్చేస్తోంది. అయితే ఆ విషయాన్ని గ్రహించలేక పోతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గిపోవటం వలన అనేక రకాల సమస్యలు ఇబ్బందులు వస్తున్నాయి. .
nutmeg
దానితో పాటు మెదడు పనితీరు మందగిస్తుంది. మతిమరుపు సమస్యను ముందుగా గుర్తిస్తే ఆ సమస్య నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొన్ని ఆహారాలను తీసుకుంటే మతిమరుపును తగ్గించుకోవచ్చు. వాటిల్లో జాజికాయ ఒకటి. జాజికాయను పురాతన కాలం నుండి వంటల్లో మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం. మతిమరుపును తగ్గించటానికి జాజికాయ బాగా సహాయపడుతుంది.

అయితే జాజికాయను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పావు స్పూను జాజికాయ పొడి కలుపుకుని తాగాలి. లేదా జాజికాయ పొడి లో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు.జాజికాయలో ఉండే మినిస్టిసిన్ అనే పదార్థం మెదడు ప‌ని తీరును మెరుగు ప‌రిచి మతిమరుపు స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.అదే స‌మ‌యంలో అల్జీమర్స్ తాలూకు లక్షణాలను కూడా త‌గ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."