చెవిలోని గులిమి మన ఆరోగ్యం గురించి ఏమి చెప్పుతుందో తెలుసా?
Ear Wax Remove tips :శరీర అవయవాల్లో ప్రస్ఫుటమయ్యే కొన్ని సంకేతాలు మన ఆరోగ్యం గురించి తెలియజేస్తాయి. ఈ సంకేతాల ఆధారంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా అనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. వీటిలో చెవి కూడా ఆరోగ్యం గురించి అనేక విషయాలను తెలియజేస్తుంది.
చెవులను తరచూ శుభ్రం చేసినా, అంతే పరిమాణంలో గులిమి మళ్లీ పేరుకుపోవడం అనేది శరీరంలో ఏదైనా సమస్య ఉందనడానికి సంకేతం. చెవిలో ఉండే గులిమి రంగులను బట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. చెవిలోని గులిమి బూడిద రంగులో ఉంటే దీన్ని సాధారణంగా పరిగణించాలి. ఎందుకంటే ప్రస్తుతం పట్టణాల్లో వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటుంది. కాబట్టి దీని ప్రభావంతో చెవిలో గులిమి బూడిద రంగులో ఉంటుంది.
చెవిలో గులిమి తీసినప్పుడు రక్తం వచ్చినట్లు అనిపిస్తే కర్ణభేరిలో పగుళ్లు ఏర్పడ్డాయడానికి సంకేతం. ఇలాంటి సందర్భాల్లో చెవిలో ఇన్ఫెక్షన్ చేరి వినికిడి ఙ్ఞానం కోల్పోయే ప్రమాదం ఉంది.
చెవులను శుభ్రం చేస్తున్నప్పుడు గులిమి గోధుమ రంగులో వస్తుంటే చాలా ఒత్తిడితో ఉన్నరనడానికి ఇది సంకేతం. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.
చెవిలో గులిమి నలుపు రంగులో ఉంటే దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్‌గా భావించాలి. ఇలాంటప్పుడు చెవిలో దురద ఎక్కువైతే వైద్యుడిని సంప్రదించాలి.
గులిమి తెలుపు రంగులో ఉంటే శరీరంలో విటమిన్లు, మూలకాలు లోపం ఉన్నట్లు భావించాలి. ప్రత్యేకంగా ఐరన్, కాపర్ లాంటి అవసరమవుతాయి.