Healthhealth tips in telugu

కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,వాపులను శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన రెమెడీ

Joint Pain Home Remedies : కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,వాపులు వంటి సమస్యలు ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులు చాలా బాధాకరంగా ఉంటాయి. నాలుగు అడుగులు వేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.
Joint pains in telugu
నొప్పులు రాగానే మనలో చాలా మంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అలా ఎక్కువగా మందులను వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా మందులు ఎక్కువ వాడకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా తయారుచేసుకోవటం చాలా సులువు.

ఒక బౌల్ రెండు స్పూన్ల కోరిన బెల్లం,ఒక స్పూన్ పసుపు,ఒక స్పూన్ సున్నం వేసి కొంచెం నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఒక క్లాత్ చుట్టాలి. ఒక గంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేస్తే మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.