మూత్రంలో మంట,ఒంట్లో వేడి క్షణాల్లో తగ్గి వెంటనే శరీరం చల్లగా అవ్వాలంటే ఇలా చేయండి
summer Sweet :వేసవికాలంలో విపరీతమైన ఎండ కారణంగా శరీరంలో వేడి, మూత్రంలో మంట అనేవి సాదరణంగా మనలో చాలా మందికి వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే స్వీట్ తింటే సరిపోతుంది. దీనికోసం ఒక కప్పు పిండి సగ్గుబియ్యం తీసుకొని నీటిని పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి.
నానిన సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి అవసరం అయితే నీటిని పోస్తూ మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. రెండు కప్పుల బెల్లంను కోరి ఒక గిన్నెలో వేసి రెండు కప్పుల నీటిని పోసి బెల్లం కరిగేవరకు పొయ్యి మీద ఉంచాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వెగించి పక్కన పెట్టాలి.
అదే పాన్ లో రెండు స్పూన్ల నెయ్యి వేసి సగ్గుబియ్యం పేస్ట్, కరిగించి ఉంచిన బెల్లంను వడకట్టాలి. ఇలా వడకడితే బెల్లంలో ఉన్న మలినలు తొలగిపోతాయి. పొయ్యి సిమ్ లో పెట్టి అడుగు అంటకుండా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కాస్త దగ్గరకు వచ్చేవరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత వేగించిన డ్రై fruits కలపాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చాక కప్ లో సర్వ్ చేయటమే.
వేసవిలో సగ్గుబియ్యం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే బెల్లం నీరసం,నిస్సత్తువ వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ఈ స్వీట్ తింటే మంచి ఉపశమనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.