మీ మూడ్ బాగోలేదా? అయితే మీ మూడ్ ను ఈ విధంగా మార్చుకోవచ్చు

How to improve mood tips : తరచూ చాలా మంది నోటి వెంట ఈ రోజు నా మూడ్ ఏమి బాగా లేదని అంటూ ఉంటారు. మూడ్ బాగా లేదని మీ నోటి వెంట వచ్చిందంటే మీరు దేని గురించో ఎక్కువ ఆలోచించుట లేదా దేని గురించైనా బాధ పడుతూ ఉండవచ్చు. పాడయిన మూడ్ ను సరి చేసుకోవటానికి కొన్ని చిట్కాలను పాటించాలి.

స్నేహితులను కలవటం లేదా నెట్ లో చాటింగ్ చేయటం చేయాలి. అదీ తరచూ కలిసే స్నేహితులను కాకుండా పాత స్నేహితులను కలిస్తే మీ మూడ్ త్వరగా మారుతుంది. పాత సంగతులను నెమరువేసుకుంటూ ప్రస్తుతం మీ మూడ్ బాగోలేకపోవటానికి గల కారణాలను మర్చిపోవచ్చు.

మీకు నచ్చిన పాటలను మీలో మీరు పాడుకోవటం కాదు. పరిసరాలు మర్చిపోయి గొత్తెత్తి పాడండి. వీలుంటే పాత పాటలను పాడటం మంచిది. పాత పాటలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతాయి. మీ మూడ్ ను తప్పనిసరిగా మారుస్తుంది. తప్పనిసరిగా ప్రయత్నించి చూడండి.

అరోమా ధెరపి శరీరానికే కాదు మనస్సుకు కూడా స్వాంతన చేకూరుస్తుంది. బాగా టేన్షన్ ఉన్నప్పుడు,మూడ్ బాగాలేనప్పుడు మీ గదిలోకి వెళ్లి కిటికీ తలుపులు తీసి మీకు నచ్చిన ప్లేవర్ ను గదిలో స్ప్రై చేయాలి. ఈ సువాసన మీలోని ఒత్తిడి,ఆందోళనను తగ్గిస్తుంది.

కొత్త కొత్త వంటలు తయారు చేయటం ప్రారంబించండి. వాటి తయారీలో పడి మీరు అసలు విషయాన్నీ మర్చిపోతారు.

మూడ్ బాగాలేనప్పుడు,మనస్సు బాధ పడినప్పుడు మేడిటేషన్ కు మించిన మందు లేదు. కొద్దిసేపు మేడిటేషన్ చేసి తర్వాత వచ్చే పలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.