Roasted Onion తింటున్నారా…అయితే ఈ నిజాలు తెలుసుకోవాలి…అసలు నమ్మలేరు
Roasted Onion health benefits : ఉల్లిపాయ వేసవిలో తింటే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అలాగే Roasted Onion తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. Roasted Onion ని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. మీడియం సైజ్ ఉల్లిపాయలను నాలుగు మక్కలుగా కట్ చేసి దానిలో ఉప్పు,ఆలివ్ ఆయిల్,మిరియాల పొడి వేసి బాగా కలిపి ఓవెన్ లో పెట్టాలి.

ఓవెన్ లేని వారు నాన్ స్టిక్ పాన్ లో వేసి సిమ్ లో పెట్టి వేగించాలి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాకుండా ఒత్తిడి, నొప్పులు మరియు డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. వీటిలో విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, రాగి, ఫాస్పరస్ మరియు మాంగనీస్,విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి.
దీనిలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలను బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేసి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు లేకుండా చేస్తుంది. ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు జీర్ణ సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. మలబద్ధకం మరియు పొట్టలో గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన వాపుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అయితే వీటిని వారంలో రెండు లేదా మూడు సార్లు తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

