Healthhealth tips in telugu

ఈ వేరుతో ఇలా చేస్తే శరీరంలో వేడి,ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది

Health Benefits of Vetiver Roots : వట్టి వేర్లను పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. మంచి సువాసన, ఔషధగుణాల్నీ, చల్లదనాన్నీ ఇచ్చే ఈ వేర్లతో తయారుచేసిన చాపలను కిటికీలకు కట్టడం, కూలర్లలో వాడటం తెలిసిందే . కానీ గడ్డి జాతికి చెందిన ఈ మొక్క వేళ్లతో వేసవి పానీయాన్నీ తయారుచేస్తారు.
Vatti Verlu
రాత్రి సమయంలో ఒక మట్టి కుండలో వట్టి వేర్లను వేసి కుండ నిండుగా నీటిని పోసి మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వేర్లను ఈ విధంగా మూడు సార్లు వాడవచ్చు. ఈ వేసవిలో శరీరంలో ఉన్న వేడిని తగ్గించటానికి సహాయ పడుతుంది. ఈ వేర్లలో ఐరన్, మాంగనీస్ సమృద్దిగా ఉండుట వలన రక్తప్రసరణ బాగా సాగేలా చేస్తుంది.

దాహం తీరాలన్నా, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే వట్టి వేర్ల నీటిని తాగవలసిందే. అలాగే ఒత్తిడి,ఆందోళన వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది. శరీరంలో పెరుకుపోయిన విషాలను బయటకు పంపుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రసరణ బాగా సాగేలా చేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ వేర్లను కొబ్బరి నూనెలో వేసి పది రోజులు అలా వదిలేసి ఆ తర్వాత ప్రతి రోజు ఆ నూనెను జుట్టుకి రాస్తే జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. వట్టి వేర్ల పొడి మార్కెట్ లో దొరుకుతుంది. ఈ పొడిని కూడా నీటిలో కలిపి తీసుకోవచ్చు. అయితే ఎంత మోతాదులో వాడాలి అనే విషయాన్ని ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.