మామిడి పండు+ఓట్స్ కలిపి ముఖానికి రాస్తే ఏమి అవుతుందో తెలుసా ?

Mango And Oats benefits : మామిడి పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మామిడిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ చర్మ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మామిడిపండులో ఉండే పోషకాలు,విటమిన్ A,బీటాకెరోటిన్ వంటివి చర్మానికి రక్షణ కల్పిస్తాయి.
mango
దీని కోసం బాగా పండిన మామిడి గుజ్జును తీసుకోవాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల మామిడి గుజ్జు,ఒక స్పూన్ ఓట్స్ పొడి, ఒక స్పూన్ బాదం పొడి, ఒక స్పూన్ తేనె వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మచ్చలు, ట్యాన్‌ తొలగిపోతుంది. అలాగే ముఖం మీద మృత కణాలు, దుమ్మూ, ధూళిని తొలగిపోయి ముఖ చర్మం మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది. ఓట్స్ చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. బాదం పొడి చర్మానికి అవసరమైన పోషణ అందిస్తుంది.

కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే చాలా తక్కువ ఖర్చుతో ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ముఖ సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.