రాత్రి పడుకొనే ముందు 1 గ్లాసు తాగితే ఎన్నో ఏళ్ల నుండి వేధిస్తున్న మోకాళ్ళ నొప్పులు జీవితంలో అసలు ఉండవు
Joint Pains Home Remedies : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అదే సమస్య పెద్దగా ఉంటే డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు. ఈ కీళ్ల నొప్పులు అనేవి కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు వస్తాయి. అలాగే కీళ్ల మధ్య శబ్దం కూడా వస్తూ ఉంటుంది. ఇలా శబ్దం రావడం కూడా కీళ్ళనొప్పులకు సూచనగా భావించాలి. ఇలా కీళ్ల మధ్య శబ్దం రాగానే జాగ్రత్తపడాలి. ఈ సమస్య నుంచి బయటపడటానికి మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం..
పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక పొయ్యి ఆఫ్ చేసి ఒక స్పూన్ రాగి పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలిపి గ్లాస్ లో పోసి తాగాలి. ఈ పాలను ఉదయం లేదా రాత్రి పడుకోవటానికి ముందు తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
రాగుల్లో calcium పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.అలాగే ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య కూడా ఉండదు. అధిక బరువు సమస్య ఉన్నవారు కూడా ఈ పాలను తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.