ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం మరియు శ్లేష్మం 7 రోజుల్లో మాయం…శుభ్రం అవుతాయి

How to Get Rid of Mucus in Chest In Telugu : ఈ రోజు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం మరియు శ్లేష్మం తొలగించుకోవటానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. ఊపిరితిత్తులలో కఫం మరియు శ్లేష్మం ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవటం చాలా కష్టం అవుతుంది. దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
Tulasi Health benefits in telugu
మన శరీరంలోని టాక్సిన్లను బయటకు తీయడంలో ఊపిరితిత్తులు సహాయపడతాయి. మన శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే, ఊపిరితిత్తులు బాగా పనిచేయాలి. ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. కాబట్టి ఊపిరితిత్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం.

ప్రతి రోజు ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టే నీటిలో పసుపు,తులసి ఆకులను వేయాలి. ఉదయం సమయంలో తేనె,నిమ్మరసం గంటలో రెండు సార్లు తీసుకోవాలి. శ్వాసకు సంబందించి వ్యాయామాలు చేయాలి. అలాగే రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కేవలం వారంలో రోజుల్లోనే కఫం,శ్లేషం తగ్గి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

తులసి ఆకులలో పొటాషియం, ఐరన్, క్లోరోఫిల్, మెగ్నీషియం, కెరోటిన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రోజూ 4-5 తులసి ఆకులు తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మరియు శుభ్రంగా ఉండటానికి తులసి తీసుకోవచ్చని ఆయుర్వేద వైధ్య నిపుణులు చెప్పుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.