Healthhealth tips in telugu

కడుపులో ఉన్న నులి పురుగులు ,మలబద్దకం,నొప్పులను తగ్గించే అద్భుతమైన ఆకు

constipation Home Remedies : చిన్న పిల్లల్లో తరచుగా నులి పురుగుల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవటం, కలుషిత నీరు తాగటం వలన వస్తుంది. నులి పురుగులు మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను గ్రహించి ఆరోగ్యంగా పెరుగుతాయి. మన శరీరానికి అందవలసిన పోషకాలను అవి గ్రహించటం వలన మనం బలహీనం అవుతాం.
stomache
ఈ సమస్య తగ్గటానికి కుప్పింటాకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ కుప్పింటాకు మొక్క రోడ్డు పక్కల ఎక్కువగానే కనపడుతుంది. పల్లెటూరి వారికి ఈ మొక్క సుపరిచతమే. కుప్పింటాకును నీటిలో వేసి మరిగించి ఆ కషాయన్ని 25 Ml మోతాదులో వారం రోజుల పాటు తీసుకుంటే నులి పురుగుల సమస్య తగ్గుతుంది.

అలాగే మలబద్దకం సమస్యతో ఉన్నవారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నులి పురుగుల సమస్య ఉన్నప్పుడు ఆకలి లేకపోవటం,పొట్ట మధ్యలో నొప్పి రావటం వంటి సమస్యలు ఉంటాయి.

కుప్పింటాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకు మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులను తగ్గించటానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ కుప్పింటాకు రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.