Healthhealth tips in telugu

వేసవిలో వచ్చే దురద,చెమట కాయలు అన్నీ రకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది..బయట కొంటే 60/-ఇంట్లో ఐతే 20/

Neem soap making at home : వేపను పురాతన కాలం నుండి చర్మ సమస్యలను తగ్గించుకోవటానికి ఉపయోగిస్తున్నారు. వేపలో ఉన్న ఔషద గుణాలు ఎన్నో సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. వేసవిలో వచ్చే సమస్యలను తగ్గించుకోవటానికి వేప ఆకులను ఉపయోగించి సబ్బు ఎలా తయారుచేయాలో చూద్దాం. కాస్త ఓపిక,సమయం ఉంటే సరిపోతుంది.
Neem leaves benefits
బాగా ముదురుగా ఉన్న వేప ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్ లో లోకి ఈ పేస్ట్ తీసుకొని దానిలో కొంచెం పసుపు, ఒక విటమిన్ E capsule లోని ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సోప్ బేస్ తీసుకొని తురమాలి. సబ్బు తురుమును డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి.

సబ్బు తురుము ద్రవంగా మారుతున్న సమయంలో ముందుగా తయారుచేసి పెట్టుకున్న వేప పేస్ట్ వేసి బాగా కలపాలి. సబ్బు ద్రవంలో వేప పేస్ట్ బాగా కలిశాక పొయ్యి మీద నుంచి దించి vaseline రాసిన బౌల్ లో పోసి ఫ్రిజ్ లో పెడితే గంటలో గట్టిగా మారతాయి. ఒకవేళ ఫ్రిజ్ లేకపోతే బయట ఉంచితే మూడు గంటల్లో గట్టిగా అవుతాయి.

ఈ వేసవిలో ఈ సబ్బును ఉపయోగిస్తే దురద,చెమట కాయలు మరియు వేసవిలో వచ్చే అన్నీ రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. soap base అనేది online stores లో లభ్యం అవుతుంది. కాబట్టి మీరు ఈ సబ్బు తయారుచేసుకొని వేసవిలో వచ్చే సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.