Healthhealth tips in telugu

క‌రివేపాకు వాడే ఆలవాటు ఉందా..? ఇది తెలిస్తే అసలు వదలకుండా తింటారు

Curry Leaves Health Benefits : క‌రివేపాకు తెలియ‌ని వారుండ‌రు. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధ పరమైన ఉపయోగాలున్నాయి. దీన్ని పూర‌త‌న కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. నిజానికి క‌రివేపాకు మ‌న‌కు విరివిరిగా దొరుకుతుంది. కరివేపాకు ఎక్కువగా ఇండియాలో పండిస్తారు. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అంతే కాదు కరివేపాకుతో అనేక ప్రయోజనాలున్నాయి.
curry leaves
అయితే చాలా మందికి క‌రివేపాకు తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.కూర‌లో క‌రివేపాకును తీసి ప‌క్క‌న పెట్టేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ దీన్ని తినడం వల్ల మాత్రం చాలానే లాభాలు ఉన్నాయి. క‌రివేపాకుతో ఆరోగ్యాన్ని..అందాన్ని కూడా పెంపొందించుకోవ‌చ్చు. మ‌రి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..క‌రివేపాకు ప్ర‌తిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సమస్యల నుంచి విముక్తి క‌లిగిస్తుంది.

వికారం, వాంతులు, డయేరియాను నివారించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. క‌రివేపాకు అధిక కొల‌స్ట్రాల్ త‌గ్గించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ప్ర‌తి రోజు త‌మ ఆహారంలో క‌రివేపాకు తీసుకోవ‌డం చాలా మంచిది. కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే.. క్రమంగా జుట్టు పెరుగుతుంది.
Hair Fall Tips In Telugu
అలాగే కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోవ‌డం త‌గ్గుతుంది.క‌రివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉంటాయి. దీన్ని ప్ర‌తి రోజు తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త‌ను దూరంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డుతున్న వాళ్ల‌కు క‌రివేపాకు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.రక్తంలో షుగ‌ర్ లెవెల్స్ త‌గ్గించే శ‌క్తి క‌రివేపాకు ఉండ‌డంతో దీన్ని రోజు తిన‌డం చాలా మంచిది.

కరివేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు ద‌రిచేర‌కుండా ఉప‌యోగ‌ప‌డుతుంది. కంటికి క‌రివేపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. క‌ర‌వేపాకులో ఉండే విట‌మిన్ ఎ కంటి స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డానికి బాగా స‌హ‌క‌రిస్తుంది..

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.