ఈ పండును తింటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు

Cholesterol Reduced Fruits : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఇది లిపోప్రొటీన్‌ల యొక్క ప్రధాన సమూహాలలో ఒకటి, ఇది శరీరం అంతటా అన్ని కొవ్వు అణువులను రవాణా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ధమనుల గోడలపై ఫలకం పొరను ఏర్పరుస్తుంది, దాంతో రక్త సరఫరాకు అడ్డంకులు ఏర్పడి స్ట్రోక్‌ కి కారణం అవుతుంది.

కొన్ని పండ్లను ఆహారంలో బాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. వాటిలో అవకాడో ఒకటి. రక్తపోటు ఉన్నవారిని అవకాడో తినమని నిపుణులు సిఫార్స్ చేస్తారు. దీనిలో విటమిన్ K, C, B5, B6, E మరియు మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉండుట వలన గుండెను ఆరోగ్యంగా ఉంచి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. దీనితో పాటు, అవకాడో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను, ట్రైగ్లిజరైడ్లను కూడా నియంత్రించగలదు.

రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని అంటారు. యాపిల్స్‌లో ఉండే పెక్టిన్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ వంటివి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. పాలీఫెనాల్స్ అనేవి గుండె కండరాలు మరియు రక్తనాళాలను దెబ్బతీయకుండా ఫ్రీ రాడికల్స్‌ను కూడా నివారిస్తాయి.

బొప్పాయి కూడా చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, ఒక పెద్ద పండు (సుమారు 780 గ్రాములు) 13 నుండి 14 గ్రాముల ఫైబర్‌ను కలిగి ఉంటుంది, ఫైబర్‌లు జీర్ణక్రియ బాగా జరిగేలా చేసి ప్రేగు కదలికను సులభతరం చేస్తాయి. మలబద్దకం సమస్య కూడా ఉండదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.