ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి క్షణాల్లో తగ్గటమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

Tulasi Drink : వేసవికాలం ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల వేడిని తట్టుకోలేక మనలో చాలా మంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. అలా తాగటం మంచిది కాదు. అలా కాకుండా ఇంటిలో తయారుచేసుకొని డ్రింక్స్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. తులసితో డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఎండ వేడి కారణంగా వచ్చే సమస్యలు తగ్గుతాయి.
Tulasi Health benefits in telugu
మిక్సీ జార్ లో అరకప్పు తులసి ఆకులు, ఒక కప్పు లేతకొబ్బరి, 10 మిరియాలు,అరకప్పు కొబ్బరి నీరు, 2 స్పూన్ల తేనె వేసి బాగా మిక్సీ చేసి గ్లాస్ లో పోసి తాగాలి. ఇలా తాగితే ఎండ దెబ్బ, వడదెబ్బ, అలసట,నీరసం, నిస్సత్తువ వంటివి ఏమి లేకుండా హుషారుగా ఉంటారు. తులసిలో యాంటీ ఫంగల్,యాంటీ వైరల్,యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి.

వేసవిలో కొబ్బరి నీరు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. శరీరంలో వేడిని తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ డ్రింక్ తయారుచేసుకొని తాగి మంచి ఫలితాన్ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.