Healthhealth tips in telugu

అరస్పూన్ పొడి తీసుకుంటే అధిక బరువు,చెడు కొలెస్ట్రాల్, డయాబెటిస్ అనేవి అసలు ఉండవు

Avise ginjala Podi : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి అవిసె గింజలతో ఒక పొడి తయారుచేసుకుందాం. ఈ పొడిని ప్రతి రోజు అరస్పూన్ మోతాదులో తీసుకుంటే ఎన్నో రకాల సమస్యల నుండి బయట పడతాము. ఈ పొడిని ఒక్కసారి చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ఒక పాన్ లో రెండు కప్పుల అవిసె గింజలను వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి. ఆ తర్వాత అదే పాన్ లో మూడు స్పూన్ల నూనె వేసి 3 స్పూన్ల పచ్చి శనగపప్పు, మూడు స్పూన్ల పొట్టు మినపప్పు, మూడు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు ఎండు మిరపకాయ ముక్కలు 7 వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి.

మిక్సీ జార్ లో వేగించిన అవిసె గింజలు,పప్పులు, కొంచెం చింతపండు, మిరపకాయ ముక్కలు సరిపడా ఉప్పు వేసి మెత్తని పొడిగా మిక్సీ చేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మరొక సారి మిక్సీ చేసి కొంచెం వేడి తగ్గాక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు తీసుకుంటే అధిక బరువు,చెడు కొలెస్ట్రాల్,రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉండవు.

అవిసె గింజలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్, మ్యుసిలేజ్ మరియు
విటమిన్ బి1, ప్రొటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, జింక్ మరియు సెలీనియంతో పాటు కరిగే మరియు కరగని పీచు పదార్ధాలను కలిగి ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.